- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. అడ్డా కూలీ స్పాట్‌ను మార్చిన అధికారులు
by Jakkula.Mamatha |
సంగారెడ్డి పట్టణంలో "రోడ్డుకు అడ్డంగా అడ్డా కూలీలు" పేరిట ఈ నెల 6న ‘దిశ’లో కథనం ప్రచురితమైంది.

X
దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో "రోడ్డుకు అడ్డంగా అడ్డా కూలీలు" పేరిట ఈ నెల 6న ‘దిశ’లో కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. శనివారం ఉదయం సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న అడ్డా కూలిని వెళ్లి పరిశీలించారు. రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా ఉండేలా అడ్డా కూలీలను అక్కడి నుంచి పక్కనే ఉన్న సిద్ధార్థ నగర్ చందనా బ్రదర్స్ వద్దకు మార్చారు. ఇకపై ఎవరు కూడా రోడ్డుపై అడ్డదిడ్డంగా నిలబడి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించకుండా ఉండే విధంగా వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. కూలీలు, ప్రజలు ఈ విషయం గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు. వారి వెంట ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి, పట్టణ సీఐ రాము నాయుడు ఇతర సిబ్బంది ఉన్నారు.
Next Story






