‘దిశ’ ఎఫెక్ట్.. స్కూల్ బస్సుల ముమ్మర తనిఖీలు

by Jakkula.Mamatha |

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఉదయం నుంచే బడి బస్సుల తనిఖీలను ముమ్మరం చేశారు.

‘దిశ’ ఎఫెక్ట్.. స్కూల్ బస్సుల ముమ్మర తనిఖీలు
X

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఉదయం నుంచే బడి బస్సుల తనిఖీలను ముమ్మరం చేశారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పలు కూడళ్లలో అధికారులు బడి బస్సులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా ఆర్టీఏ అధికారులు జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా.. అని పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సులు ఫిట్ 'లెస్' శీర్షికన మంగళవారం 'దిశ 'లో ప్రచురించిన కథనానికి స్పందించిన అధికారులు జిల్లా వ్యాప్తంగా బడి బస్సుల తనిఖీలను ముమ్మరం చేశారు.

Next Story