sunlight: సూర్యకాంతి తగలట్లేదా.. తలెత్తే వ్యాధులేంటో తెలుసుకోండి..?

by Kodari Anjali |

‘‘సూర్యుని నుంచి భూమిని చేరే కాంతిని సూర్యరశ్మి (Sunlight) అని అంటారు.

sunlight: సూర్యకాంతి తగలట్లేదా.. తలెత్తే వ్యాధులేంటో తెలుసుకోండి..?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘‘సూర్యుని నుంచి భూమిని చేరే కాంతిని సూర్యరశ్మి (Sunlight) అని అంటారు. ఇది సూర్యుని నుంచి వెలువడే విద్యుదయస్కాంత(electromagnetic) వికిరణాలలో ఒక భాగం. భూమిపై సూర్యుని నుంచి వచ్చే సూర్యకాంతి వాతావరణం(weather) వల్ల వడపోయబడుతుంది’’. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే బాడీకి సూర్యకాంతి అవసరమా? లేదా? సూర్యకాంత తగలకపోతే ఏఏ సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం..

ఎముకల ఆరోగ్యానికి (bone health)సూర్యకాంతి ఎంతో అవసరం. ఇది రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచడంలో మేలు చేస్తుంది. కాగా సూర్య కాంతి లేకపోతే మెలటోనిన్ ఉత్పత్తి(Melatonin production)కి అంతరాయం ఏర్పడి.. నిద్ర సమస్యలు(sleep problems) తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే సెరోటోనిన్ లెవల్స్(Serotonin levels) ప్రభావితం చేస్తుంది. సూర్యకాంతి తగలకపోతే విటమిన్ డి(Vitamin D) లోపానికి గురి అవుతారు. దీర్గకాలిక ఎముకల బలాన్ని, ఇమ్యూనిటిని దెబ్బతీస్తుంది కూడా. కండరాల పనితీరు తగ్గుతుంది. అలాగే నిరాళ, ఆందోళన(worry), బద్ధకం(laziness) వంటి సమస్యలు వస్తాయి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story