- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యా కమిషన్ నివేదిక పై చర్చలు జరపాలి: ఏఐఎస్ఎఫ్
తెలంగాణ విద్యా కమిషన్ నివేదికను విద్యార్థి సంఘాల భాగస్వామ్యం లేకుండా రూపొందించడాన్ని ఏఐఎస్ఎఫ్ తప్పుబట్టింది. ఎంసెట్ రద్దు, పాస్ మార్కుల పెంపు వంటి నిర్ణయాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ హెచ్చరిక జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం(2020)కి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ విద్యా కమిషన్ రూపొందించిన నివేదిక ఉందని, దీనిపై చర్చలు జరపాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ నివేదికపై విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యావంతులతో చర్చలు జరపాలని, నివేదికపై లక్షలాది మంది తల్లిదండ్రులు అభిప్రాయాలు సేకరించి 45 పేజీల నివేదిక రూపొందించామని చెబుతున్న కమిషన్ ఒక్క విద్యార్థి సంఘం అభిప్రాయం తీసుకోకుండా నివేదిక ఎలా రూపొందించారని తెలిపారు. అభిప్రాయ సేకరణ ఏ ప్రాంతంలో ఏ యూనివర్సిటీ లో ఏ కళాశాలలో నిర్వహించారో తెలపాలని కోరారు. కొన్ని సిఫార్సులు బాగున్నాయని అందులో విద్యార్థి సంఘాలకు ఎన్నికల నిర్వహణ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టడం బాగున్నాయని చెప్పారు.
విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం 35 శాతం నుంచి 45 శాతం పెంచాలనే సిఫార్సు ఎంసెట్ రద్దు చేయాలని, మార్కుల ఆధారంగా సీట్లు అంటే ఆటోమేటిక్ గా ప్రైవేట్ కళాశాలలకు మద్దతు ఇస్తున్నట్లు అవుతుందని చెప్పారు. డీఎడ్ కోర్సు రద్దు చేస్తే ప్రైమరీ స్కూళ్ల పరిస్థితి ఏమిటి? ప్రైమరీ స్కూల్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెడితే మరి అంగన్వాడీలు, ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఎందుకున్నట్టు? అని ప్రశ్నించారు. విద్యా కమిషన్ చేసిన సిఫార్సుల్లో లోపాలు, అనుమానాలు ఉన్నాయని, విద్యా కమిషన్ సిఫార్సులపై విద్యార్థి సంఘాలు, విద్యావంతులు, మేధావులు ఉపాధ్యాయ సంఘాల వారితో ప్రభుత్వం, విద్యా కమిషన్ చర్చించి విద్యార్థులకు ఉపయోగపడే సమగ్రమైన విద్యా విధానం రూపొందించాలని, కోరారు. ఈ విద్యా విధానం అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా ఉండేటట్లు ఉండాలని, ప్రభుత్వం కేవలం విద్యా కమిషన్ వారు ఇచ్చిన రిపోర్టు ఆమోదించి అమలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని, విద్యా కమిషన్ రిపోర్టుకు నిరసనగా తప్పకుండా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ హెచ్చరించారు.






