జీవన్ రెడ్డి టీషర్టుపై నెట్టింట చర్చ.. దాని విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

by Disha Web Desk |
జీవన్ రెడ్డి టీషర్టుపై నెట్టింట చర్చ.. దాని విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
X

దిశ, డైనమిక్ బ్యూరో : 'వాడి వాచ్ అమ్మితే నీ లైఫ్ సెట్ అవుతుంది' అని అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్ సమంత కమెడియన్ వేణుతో అంటుంటే.. కేవలం సినిమాల్లోనే అలా ఉంటుంది అనుకున్నాం. ఆ తర్వాత సినిమా రిలీజ్ ఫంక్షన్లు, ప్రీరిలీజ్ ఫంక్షన్లలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు వేసుకున్న డ్రెస్‌లు, చేతికున్న వాచ్‌లు, చెప్పుల ధరలపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. ఆ సమయంలో అత్తారింటికి దారేది సినిమా డైలాగ్ వినియోగించి మిమ్స్‌ కూడా తెగ వైరల్ అయ్యాయి. అయితే, సినీ హీరోల కంటే నేనేమి తక్కువ కాదంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాస్ట్లీ బట్టలు ధరించేందుకు పోటీ పడుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీ గురువారం ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ధరించిన టీషర్ట్ పై నెట్టింట చర్చ జరుగుతోంది. ఆయన వేసుకున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ 'BALMAIN PARIS' కంపెనీకి చెందిన టీషర్ట్ అక్షరాలా 547 డాలర్లు.. అంటే రూ. 40వేలు. అయితే, ఆయన గతంలోనూ మిలీనియర్స్ వాడే రూ.2 కోట్ల విలువ చేసే మెర్సిడిస్ బెంజ్ కంపెనీకి చెందిన జీప్ వాహనాన్ని కొని అందరి దృష్టిని ఆకర్షించారు.

Next Story