ఆ నలుగురు.. తెలుగులో వందశాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లు!

by Gantepaka Srikanth |

తెలుగు సినిమాలు ప్రస్తుతం భారత చిత్రపరిశ్రమను శాసిస్తున్నాయి.

ఆ నలుగురు.. తెలుగులో వందశాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమాలు ప్రస్తుతం భారత చిత్రపరిశ్రమను శాసిస్తున్నాయి. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్‌ చిత్రాలే. కానీ ఇవాళ తెలుగు సినిమాలన్నీ పాన్‌ ఇండియా చిత్రాలే. మన హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరూ పాన్ ఇండియా చిత్రాలతో అదరగొట్టేస్తున్నారు. ‘బాహుబలి’, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప వంటి సినిమాలు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాయి. సినిమాను ఆ రేంజ్‌లో సక్సెస్ చేయాలంటే డైరెక్టర్‌దే కీలక పాత్ర. అయితే.. కొంతమంది డైరెక్టర్లు ఒకసారి సక్సెస్ అవుతారు.. రెండుసార్లు సక్సెస్ అవుతారు. రెండు మూడు హిట్ల తర్వాత ఫెయిల్ అయిన డైరెక్టర్లూ ఉన్నారు. కానీ ఈ నలుగురు మాత్రం ఇప్పటివరకూ ఓడిపోలేదు. ప్రతీ సినిమాను బ్లాక్ బస్టర్‌గా తెరకెక్కించారు. వాళ్లే రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్. వీరంతా తీసింది తక్కువ సినిమాలే అయినా.. వారి హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఆ సినిమాల వివరాలు తెలుసుకుందాం.

రాజమౌళి: స్టూడెంట్ నెం.1, సింహాద్రి, సై, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్క్లూజన్, RRR సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి.

అనిల్ రావిపూడి: పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం. మనశంకర వరప్రసాద్ గారు వంటి విజయవంతమైన చిత్రాలను అనిల్ రావిపూడి రూపొందించారు.

సందీప్ రెడ్డి వంగా: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్.

నాగ్ అశ్విన్: కల్కి 2898 AD, మహానటి, ఎవడే సుబ్రమణ్యం.

Next Story