'న‌ల్లమ‌ల' ట్రైల‌ర్ విడుదల చేసిన దిల్ రాజు..

by Web Desk |
న‌ల్లమ‌ల ట్రైల‌ర్ విడుదల చేసిన దిల్ రాజు..
X

దిశ, సినిమా: అమిత్‌ తివారీ భానుశ్రీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'నల్లమల'. రవి చరణ్ ‌దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నా ఈ సినిమాను ఆర్.ఎమ్ నిర్మిస్తుండగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజ్‌ మాట్లాడుతూ..'అందరూ కొత్త వాళ్లు కలిసి ఇలా కొత్త సినిమాలు తీస్తున్నారు. ఎంత మంది సక్సెస్ అవుతున్నారో గమనించి సినిమాలు తీయండని నా వద్దకు వచ్చే వారికి చెబుతాను. కొత్తగా చేసే వారిని ప్రోత్సహించాలని నాకు ఉంటుంది. అలా నన్ను ఒకరు ప్రోత్సహిస్తేనే ఇక్కడి వరకు వచ్చాను. నల్లమల సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. మూవీ యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్' అంటూ ముగించారు. దర్శకుడు మాట్లాడుతూ.. 'నిర్మాత దూరంగా ఉన్నా కూడా నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. పాట విడుదలైన రోజు నుంచి ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. సినిమా విడుదల కంటే ముందే ఇలాంటి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. మా సినిమా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది' అన్నారు. 'ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ఈ రోజు ట్రైలర్ విడుదలైనందుకు సంతోషంగా ఉంది. దిల్ రాజు గారు ఇక్కడికి వచ్చినందుకు థాంక్స్. నల్లమల సినిమాకు హీరోనే కథ. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాం. ఏ సినిమాలోనైనా విషయం ఉంటే ఈవెంట్ ఎక్కడ చేసినా చూస్తారు. కొత్త వాళ్లంతా కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌ అవ్వాలి. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌' అన్నారు హీరో అమిత్ తివారీ. ఇక ఈ సినిమాలో నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Next Story

Most Viewed