భారత్ నుండి బంగ్లాదేశ్‌కు పైప్‌లైన్ ద్వారా డీజిల్ సరఫరా ప్రారంభం

by Malleboina Mahesh |

భారత్ నుండి బంగ్లాదేశ్‌కు పైప్‌లైన్ ద్వారా డీజిల్ సరఫరా. ఏడాదికి 1.80 లక్షల టన్నుల సరఫరాకు ఒప్పందం - బీపీసీ చైర్మన్ రెజానూర్ రెహ్మాన్.

భారత్ నుండి బంగ్లాదేశ్‌కు పైప్‌లైన్ ద్వారా డీజిల్ సరఫరా ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ బంగ్లాదేశ్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య గతంలో కుదిరిన ఇంధన ఒప్పందంలో భాగంగా, ప్రతి ఏటా పైప్‌లైన్ ద్వారా బంగ్లాదేశ్‌కు 1.80 లక్షల టన్నుల డీజిల్‌ను భారత్ సరఫరా చేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం 5,000 టన్నుల డీజిల్ కన్సైన్‌మెంట్ బంగ్లాదేశ్‌కు చేరుకుందని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (BPC) చైర్మన్ మొహమ్మద్ రెజానూర్ రెహ్మాన్ వెల్లడించారు. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన, ఈ సరఫరా ఇరు దేశాల మధ్య ఉన్న పటిష్టమైన ఇంధన సంబంధాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

అలాగే ఒప్పందం ప్రకారం ప్రతి ఆరు నెలలకు కనీసం 90,000 టన్నుల డీజిల్‌ను బంగ్లాదేశ్ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అందిన 5,000 టన్నుల కన్సైన్‌మెంట్ ప్రాథమిక దశ అని, రాబోయే రెండు నెలల్లోనే ఆరు నెలలకు సరిపడా మొత్తం డీజిల్‌ను దిగుమతి చేసుకుంటామని రెహ్మాన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ పైప్‌లైన్ ద్వారా ఇంధన రవాణా వేగవంతం కావడమే కాకుండా, రవాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని బీపీసీ చైర్మన్ అభిప్రాయపడ్డారు.

Next Story