- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖత్గావ్‌లో డీజిల్ మోసం
బిచ్కుంద మండలం ఖత్గావ్ శివారులోని ఇండియన్ పెట్రోల్ బంక్‌లో రైతుకు డీజిల్ మోసం వెలుగుచూసింది.

దిశ, మద్నూర్ : బిచ్కుంద మండలం ఖత్గావ్ శివారులోని ఇండియన్ పెట్రోల్ బంక్‌లో రైతుకు డీజిల్ మోసం వెలుగుచూసింది. డోంగ్లి మండలం ఇలేగావ్‌కు చెందిన ఓ రైతు రూ. 2400 విలువైన డీజిల్‌ను డబ్బాలో పోయించుకున్నాడు. అయితే ఎప్పటిలాగే తీసుకెళ్లే డబ్బాలో డీజిల్ 2-3 లీటర్లు తక్కువగా రావడంతో సిబ్బందిని నిలదీశాడు.
రైతు ఆరోపణ:
ఎప్పుడూ ఇదే డబ్బాలో తీసుకెళ్తాను. ఈసారి రెండు నుంచి మూడు లీటర్లు తక్కువగా వచ్చింది అని వాగ్వాదానికి దిగాడు. స్థానికులు కూడా జోక్యం చేసుకోవడంతో సిబ్బంది మళ్లీ డీజిల్ పోశారు. ఈసారి 2-3 లీటర్లు ఎక్కువగా వచ్చిందని రైతు తెలిపాడు. అంతేకాకుండా రూ. 200 రీడింగ్ చూపించినా డబ్బాలో చుక్క పెట్రోల్ కూడా పడలేదని ఆరోపించాడు. రీడింగ్‌కు, వచ్చిన డీజిల్‌కు తేడా ఉండటంతో పెట్రోల్ బంక్‌లపై తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బంక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పెట్రోల్ బంక్ సిబ్బంది వివరణ:
దీనిపై పెట్రోల్ బంక్ సిబ్బంది 'దిశ'కు వివరణ ఇస్తూ డీజిల్ ట్యాంకర్ ఈ రోజే ఇప్పుడే వచ్చి పోసిపోయింది. అందువలన 'ఎయిర్' వచ్చింది. అందుకే తక్కువగా డీజిల్ రావడం జరిగింది అని తెలిపారు.






