- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడికి డుమ్మా కొట్టి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన పీఈటీ..?
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కల్వల జడ్పీహెచ్‌ఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) పాఠశాలకు హాజరుకాకుండా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కల్వల జడ్పీహెచ్‌ఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) పాఠశాలకు హాజరుకాకుండా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఉపాధ్యాయుడు పై అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా, సెలవు కూడా నమోదు చేయకుండా ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థులకు బోధనకు అంతరాయం ఏర్పడిందని వారు అంటున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)ను వివరణ కోరగా, "ఈ విషయం నా దృష్టికి రాలేదు. ఫిర్యాదు అందితే పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, వాస్తవాలు తేలిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. అయితే, ఇవి స్థానికులు చేసిన ఆరోపణలు మాత్రమే. సంబంధిత పీఈటీ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు చేపట్టే చర్యలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.






