బాలీవుడ్‌లో కొత్త బాక్సాఫీస్ కింగ్.. 'ధురంధర 2' ధాటికి పాత రికార్డులన్నీ గల్లంతు!

by Malleboina Mahesh |   (  Updated:2026-03-22 07:54:43  IST  )

బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్‌ సింగ్‌ 'ధురంధర్ 2' ప్రభంజనం! కేవలం 3 రోజుల్లోనే ₹500 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రికార్డులు తిరగరాస్తున్న స్పై థ్రిల్లర్.

బాలీవుడ్‌లో కొత్త బాక్సాఫీస్ కింగ్.. ధురంధర 2 ధాటికి పాత రికార్డులన్నీ గల్లంతు!
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ (Director Aditya Dhar,), స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) కాంబినేషన్‌లో వచ్చిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. పార్ట్ 1 థియేటర్లలో ఉండగానే పార్ట్-2ను 'ధురంధర్- రివేంజ్' ('Dhurandhar- Revenge') పేరుతో కేవలం 3 నెలల్లోని సినిమాని తీసి దాదాపు నాలుగు గంటల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ ధురంధర్ 2 మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

సాక్నిల్క్ (Sacnilk) గణాంకాల ప్రకారం, ఈ చిత్రం ఇండియాలో ₹339 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా, ఓవర్సీస్ మార్కెట్‌లో ₹96 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవడమే కాకుండా, అతి తక్కువ సమయంలో ₹500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దర్శకుడు ఆదిత్య ధర్ తన గత చిత్రం 'ఉరి' మ్యాజిక్‌ను మించిపోయేలా ఈ స్పై థ్రిల్లర్‌ను అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు.

థియేటర్లలో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ లభిస్తుండటంతో వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా జోరు తగ్గేలా కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్, ఇంటర్నేషనల్ మార్కెట్లలో కూడా 'ధురంధర్ 2' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సక్సెస్‌తో రణవీర్ సింగ్ తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి ప్రపంచవ్యాప్తంగా నిరూపించుకున్నారు. అలాగే బాలీవుడ్‌లో కొత్త బాక్సాఫీస్ కింగ్ తానేనని నిరూపిస్తూ.. 'ధురంధర్ 2' ధాటికి పాత రికార్డులన్నీ ఒక్కొక్కటిగా గల్లంతవుతున్నాయి.

Next Story