బోయిగూడ యూపీహెచ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిహెచ్ఓ

by Jakkula.Mamatha |

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ సీతాఫల్‌మండి క్లస్టర్ పరిధిలోని బోయిగూడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

బోయిగూడ యూపీహెచ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిహెచ్ఓ
X

దిశ, సీతాఫలమండి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ సీతాఫల్‌మండి క్లస్టర్ పరిధిలోని బోయిగూడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, వివిధ రికార్డులు మరియు ఆసుపత్రి పరిశుభ్రత పరిస్థితులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే యూపిహెచ్సీ పరిధిలోని పేద ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య సేవలు, వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, వైద్య సేవల నాణ్యత పెంపు పై ప్రత్యేక దృష్టి సారించాలని డా.పుట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.

Next Story