- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధనుష్, వెట్రిమారన్ కొత్త సినిమా.. "తమిళ మురుగన్"
ధనుష్, వెట్రిమారన్ కలయికలో రాబోతున్న 5వ ప్రతిష్టాత్మక చిత్రానికి "తమిళ మురుగన్" అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్, సెన్సేషనల్ కాంబినేషన్‌గా పేరుగాంచిన నటుడు ధనుష్, సంచలన దర్శకుడు వెట్రిమారన్ మళ్లీ చేతులు కలిపారు. వీరిద్దరి కలయికలో రాబోతున్న 5వ ప్రతిష్టాత్మక చిత్రానికి "తమిళ మురుగన్" (Thamizh Murugan) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం జూలై 10న అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం రేగుతోంది.
తమిళ సంస్కృతి నేపథ్యంలో!
తమిళ సంస్కృతి, పురాణాలలో ప్రత్యేక స్థానమున్న సుబ్రహ్మణ్య స్వామి లెగసీ ఆధారంగా ఈ చిత్రాన్ని ఒక హిస్టారికల్-ఎపిక్ తరహాలో తెరకెక్కిస్తున్నారు. మురుగన్‌ను కేవలం దైవంగానే కాకుండా, తమిళ ప్రజల సంరక్షకుడిగా, గొప్ప యోధుడిగా, రాజుగా, తిరుగులేని నాయకుడిగా ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
రకరకాల చర్చలకు దారితీసిన ఫస్ట్ లుక్!
చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇందులో ధనుష్ ఒక భారీ ఏనుగుపై గంభీరంగా కూర్చొని, చేతిలో మురుగన్ ఆయుధమైన 'వేల్' పట్టుకుని, వెనుక భారీ సైన్యంతో కనిపిస్తున్న విజువల్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. ఈ పోస్టర్‌ను #SonOfKottravai అనే పవర్‌ఫుల్ హ్యాష్‌ట్యాగ్‌తో విడుదల చేశారు.
మరోసారి బాక్సాఫీసు బద్దలేనా?
గతంలో ధనుష్ - వెట్రిమారన్ కాంబినేషన్‌లో వచ్చిన పొల్లాదవన్, ఆడుకాలం, వడ చెన్నై, అసురన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మైలురాళ్లుగా నిలిచాయి. 'అసురన్' చిత్రానికి గాను ధనుష్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్తుండటం, అది కూడా తమిళ సెంటిమెంట్, డివోషనల్-వారియర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘అల్టిమేట్’ చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో అదనపు ఆకర్షణ.






