ఫుల్ ఫామ్‌లో ఉన్న ధనుష్.. హిట్ డైరెక్టర్‌తో భారీ ప్రాజెక్ట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-23 07:01:25  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు.

ఫుల్ ఫామ్‌లో ఉన్న ధనుష్.. హిట్ డైరెక్టర్‌తో భారీ ప్రాజెక్ట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ‘అమరన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి(Rajkumar Periyasamy)తో ధనుష్ తన 55వ చిత్రాన్ని (#D55) అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ ‘వండర్‌బార్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఆర్‌టేక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తుండటం విశేషం. మొదట వేరే నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల వారు తప్పుకోవడంతో ధనుష్ రంగంలోకి దిగారట. ఈ క్రేజీ ప్రాజెక్టులో ధనుష్ సరసన ‘రౌడీ బేబీ’ భామ సాయి పల్లవి కథానాయికగా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఈ చిత్రం ఒక భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాగా లేదా మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథగా ఉండవచ్చని సమాచారం. 'అమరన్' సినిమాతో భావోద్వేగాలను, యాక్షన్‌ను అద్భుతంగా పండించిన రాజ్‌కుమార్, ధనుష్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ధనుష్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారని, ఇది ఆయన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిలిం కానుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ధనుష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More..

‘తలైవార్-176’ కోసం ఇద్దరు భామలు.. ఆ డిజాస్టర్ హీరోయిన్ వద్దంటున్న నెటిజన్లు

Next Story