- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం జాతర.. చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు
మేడారం జాతరకు చివరి రోజైన శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు చేయడంతో పాటు మేడారం గద్దెల వద్ద దర్శనాలు చేసుకున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో: మేడారం జాతరకు చివరి రోజైన శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు చేయడంతో పాటు మేడారం గద్దెల వద్ద దర్శనాలు చేసుకున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన జాతరకు సుమారు కోటిన్నర వరకు భక్తులు వచ్చారని అంచనా వేస్తున్నారు. చివరి రోజు కూడా ఉదయం నుంచే భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. జంపన్న వాగు వద్ద జనం పోటెత్తారు.
చివరి రోజు భారీగానే వీఐపీల రాక
మేడారానికి చివరిరోజు భారీగానే వీఐపీలు వచ్చారు. అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కుటుంబ సమేతంగా శని ఉదయం 5 గంటలకు మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా గద్దెలపై కొలువైన శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించారు. సమ్మక్క, సారలమ్మలను శనివారం హైకోర్టు జడ్జిలు సృజన, రాణి తమ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు వారికి ఘన స్వాగతం పలకగా.. వారు అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కులను అప్పజెప్పారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు ప్రసాదం అందచేశారు.
శనివారం వన దేవతలను కుటుంబ సమేతంగా.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి అమ్మవార్ల ప్రసాదం అందించారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ శనివారం శ్రీ సమ్మక్క సారలమ్మని దర్శించుకుని తమ మొక్కులను అమ్మవార్లకి సమర్పించారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా అమ్మవార్లను ఐ.జి తరుణ్ జోషి దంపతులు దర్శించుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ సమ్మక్క- సారలమ్మ తల్లుల దర్శనం చేసుకుని రాష్ట్ర హైకోర్టు జడ్జి మాధవి దేవి మొక్కులు తీర్చుకున్నారు. వారికి దేవాదాయ శాఖ అధికారులు ములుగు జిల్లా జ్యోత్స్నలు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. శ్రీ సమ్మక్క- సారలమ్మ తల్లుల దర్శనానికి విచ్చేసి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్న హైకోర్టు జడ్జి విజయ్ సేన్ రెడ్డి, ప్రదీప్ అమ్మవార్లను దర్శించుకున్నారు. నిజామాబాద్ శాసనసభ్యులు డాక్టరు భూపతి రెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు.
తప్పని ట్రాఫిక్ సమస్యలు..
మేడారం జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. శుక్రవారం సాయంత్రం ఆరంభమైన ట్రాఫిక్ సమస్యలు శనివారం కూడా కొనసాగాయి. పస్రా నుంచి తాడ్వాయి, మేడారం వరకు వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. శుక్రవారంతో పోలిస్తే కొంత తగ్గిన ఈ ట్రాఫిక్ సమస్యలు మాత్రం తప్పలేదు.






