మేడారంలో ప్రసాదం కోసం భక్తుల పాకులాట

by Malleboina Mahesh |

మేడారం మహాజాతరలో భక్తుల రద్ధీ భారీగా పెరిగిపోయింది. నిన్న రాత్రి సారలమ్మ గద్దె మీదకు రావడం తో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు.

మేడారంలో ప్రసాదం కోసం భక్తుల పాకులాట
X

దిశ, మేడారం నెట్‌వర్క్: మేడారం మహాజాతరలో భక్తుల రద్ధీ భారీగా పెరిగిపోయింది. నిన్న రాత్రి సారలమ్మ గద్దె మీదకు రావడం తో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో మేడారం దర్శనానికి వచ్చిన భక్తులు తమ మొక్కులు గద్దెలపై వేసి అదే గద్దెల మీద ఉన్న బంగారం(బెల్లం కోసం) ప్రాధేయ పడుతున్నారు. వ్యవప్రసాల కోర్చి తల్లులను దర్శించుకున్న భక్తులకు గద్దెల ఉన్న ప్రసాదం పొందడానికి పాకులాడుతున్నారు. ప్రభుత్వం భక్తులకు ఉచిత దర్శనం తో పాటు బంగారం ప్రసాదం ఉచితంగా ఇవ్వాలని ఆదేశించినా బెల్లం టెండర్లు దక్కించుకున్న గుత్తేదార్లు భక్తులు గద్దెలపై వేసే బంగారాన్ని తమ కూలీలతో వెంట వెంటనే తరలించడంతో భక్తులకు గద్దెలపై ఉన్న ప్రసాదం (బెల్లం) అందడం లేదు. దీంతో గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెల మధ్య చేతులు పెట్టి.. ప్రసాదం తీసుకునేందుకు భక్తులు పాకులాడుతున్నారు.

Next Story