- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిలుకూరుకు పోటెత్తిన భక్తులు
వేసవి సెలవుల నేపథ్యంలో చిలుకూరు బాలాజీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

దిశ, వెబ్ డెస్క్ : వేసవి సెలవుల నేపథ్యంలో చిలుకూరు బాలాజీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అలాగే శనివారం శనైశ్చర జయంతి కూడా కలసి రావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం దర్శనాలను ప్రారంభించారు. భారీ రద్దీని నియంత్రించడానికి ఆలయ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రాచుర్యం పొందిన 11, 108 ప్రదక్షిణలను పూర్తిగా నిలిపేశారు. భక్తుల సౌకర్యార్థం ఐదు వరుసల క్యూలైన్‌ను ఏర్పాటు చేసి, కేవలం మహాద్వారం గుండా మాత్రమే దర్శనానికి అనుమతించారు. ఈ చర్యల వల్ల రాత్రి 7 గంటల సమయానికి సుమారు 45 వేల మంది భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాలాజీని దర్శించుకోగలిగారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో భక్తుల రాక అంతకంతకూ పెరుగుతోందని ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ తెలిపారు.






