గార్లఒడ్డులో డిప్యూటీ కమిషనర్ పూజలు

by Ratna Kumari |

ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ ఆదివారం సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గార్లఒడ్డులో డిప్యూటీ కమిషనర్ పూజలు
X

దిశ, ఏన్కూర్ : ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ ఆదివారం సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేణుగోపాల ఆచార్యులు, నాగరాజు ఆచార్యులు దేవాలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యాన్ని డిప్యూటీ కమిషనర్‌కు వివరించారు. అలాగే ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆలయ అర్చకులు డిప్యూటీ కమిషనర్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌వీడీ ప్రసాద్, నారాయణరావు, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story