Airtel, Vodafone Idea కు భారీ ఊరట..

by Disha Web Desk 17 |
Airtel, Vodafone Idea కు భారీ ఊరట..
X

దిశ, వెబ్‌‌డెస్క్: టెలికాం దిగ్గజాలు అయినటువంటి భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలకు టెలికాం శాఖ (DoT) బ్యాంక్ గ్యారెంటీలను వాపసు చేసింది. ఈ విషయాన్ని DoT శాఖ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. బ్యాంకు గ్యారంటీ మొత్తం రూ.23,000 కోట్లు. దీనిలో రూ. 7,000 కోట్లు ఎయిర్‌టెల్‌కు, రూ.15,000 కోట్లు వోడాఫోన్ ఐడియాకు తిరిగి చెల్లించాలి. ఇప్పటికే నష్టాలతో ఉన్న VIL కి ఇది భారీ ఉపశమనం. దాని రుణ భారాన్ని భారీగా తగ్గించడంలో సహాయపడుతుంది. vodafone idea రుణ భారం మొత్తం దాదాపు రూ. 1.9 ట్రిలియన్లు. VIL(వోడాఫోన్ ఐడియా) ఇప్పటికే దాని ప్రమోటర్లు ఆదిత్య గ్రూప్ నుంచి రూ. 4,500 కోట్లు పొందింది. ఇతర మార్గాల ద్వారా రూ.10,000 కోట్లను సమీకరించడానికి పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. వొడాఫోన్ ఐడియా నివేదిక ప్రకారం, ప్రభుత్వ రిలీఫ్ ప్యాకేజీ కంపెనీ తన AGR బకాయిలను నాలుగు సంవత్సరాల తర్వాత చెల్లించడానికి అనుమతించిందని, కంపెనీలో ప్రధాన బకాయి మొత్తాన్ని ప్రభుత్వ ఈక్విటీ గా మార్చడం ద్వారా రుణ తగ్గింపుకు మరింత సహాయపడుతుందని కంపెనీ తెలిపింది. టెలికాం రంగం ఆర్థిక వ్యవస్థకు వెన్నుముఖగా నిలుస్తుందని, రానున్న కాలంలో 5G సాంకేతికత దేశ ఆర్థిక పురోగతికి ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Next Story

Most Viewed