- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇజ్రాయెల్‌లో ఐక్యరాజ్యసమితి కార్యాలయం కూల్చివేత
ఇజ్రాయెల్‌లో పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న UNRWA ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దళాలు కూల్చివేశాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్‌లో పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సంస్థ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దళాలు కూల్చివేశాయి. తూర్పు జెరూసలెంలోని షేఖ్ జర్రా ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం.. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బలవంతంగా బయటకు పంపి భవనాన్ని నేలమట్టం చేసింది. ఈ మేరకు UNRWA 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. ఇజ్రాయేల్ చర్య అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి హక్కులకు విరుద్ధమని ఆ సంస్థ తీవ్రంగా మండిపడింది.
అయితే యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. తమ దేశంలో ఆ సంస్థను నిషేధిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారమే కూల్చివేతలు జరిగాయని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. కాగా 1950 నుంచి యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఇజ్రాయెల్‌లో పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తూ.. పాఠశాల విద్య, వైద్య సేవలు అందిస్తూ పనిచేస్తోంది.






