ట్రాక్టర్ ఢీకొని డెలివరీ బాయ్ మృతి

by Batti.Sumithra |

ట్రాక్టర్ ఢీకొని డెలివరీ బాయ్ మృతి చెందిన సంఘటన నార్సంగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ట్రాక్టర్ ఢీకొని డెలివరీ బాయ్ మృతి
X

దిశ, గండిపేట: ట్రాక్టర్ ఢీకొని డెలివరీ బాయ్ మృతి చెందిన సంఘటన నార్సంగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ కిలా ఫిల్ఖానాకు చెందిన రహమత్ అన్సారీ (19) జెప్టోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఆదివారం మధ్యాహ్నం జెప్టోకు సంబంధించిన వస్తువులను డెలివరీ చేసేందుకు తన ఎలక్ట్రిక్ బైక్ పై వెళ్తుండగా, పుప్పాలగూడ పైప్‌లైన్ రోడ్డులో హీరో షోరూమ్ సమీపంలో వాటర్ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో రహమత్ అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని భూమి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

Next Story