హిస్టరీ రిపీట్.. ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఘన విజయం..

by Disha Web |
హిస్టరీ రిపీట్.. ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఘన విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ సీజన్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణి కొట్టింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. ఐదు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు పంత్ సేన ఒకానొక దశలో 72 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. కాగా, ఓటమి దిశగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌ అదుకున్నారు. ఈ జోడి చివరి వరకు క్రీజ్‌లో ఉండి ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. లలిత్‌ యాదవ్‌( 38 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌(17 బంతుల్లో 38, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖర్లో​మెరుపులు మెరిపించి ఈ సీజన్‌లో జట్టుకు తొలి విజయాన్ని అందించారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed