- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WPL... ముంబయిపై ఢిల్లీ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో నేడు ముంబయి జట్టుపై ఢిల్లీ విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్ : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో నేడు ముంబయి జట్టుపై ఢిల్లీ విజయం సాధించింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నాట్ సైవర్-బ్రంట్ 65 పరుగులతో అజేయంగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 41 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శ్రీ చరణి 3 వికెట్లతో ఆకట్టుకుంది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి విజయం అందుకుంది.
కెప్టెన్ జెమిమా రొడ్రిగ్స్ 51 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు దిశగా నడిపించింది. లిజెల్ లీ 46 పరుగులతో సహకరించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన జెమిమా రొడ్రిగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేస్‌లో నిలబడగా, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఇది మూడో వరుస ఓటమిగా మారింది.






