Namaste Gang: నమస్తే గ్యాంగ్ కేసులో ఇద్దరు అరెస్ట్

by Chukka Sudharani |   (  Updated:2022-08-04 11:16:25  IST  )

Two Criminals Of Namaste Gang Arrested| నమస్తే గ్యాంగ్ కేసులో గురువారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో పోలీసులు గస్తీ నిర్వహించారు. నిందితులు ఘజియాబాద్ నుంచి వస్తున్నప్పుడు వారిని షాహదారా వద్ద పోలీసులు అడ్డుకున్నారు

Two Criminals Of Namaste Gang Arrested
X

న్యూఢిల్లీ: Two Criminals Of Namaste Gang Arrested| నమస్తే గ్యాంగ్ కేసులో గురువారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో పోలీసులు గస్తీ నిర్వహించారు. నిందితులు ఘజియాబాద్ నుంచి వస్తున్నప్పుడు వారిని షాహదారా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ.. పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు కూడా వారిపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ముఠా సభ్యులలో ఒకడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు క్షతగాత్రుడిని ఆస్పత్రిలో జాయిన్ చేయించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఆఫ్జల్ (32), షహీద్ (43)గా పోలీసులు గుర్తించారు. ఈ నమస్తే గ్యాంగ్.. అమాయకులను మొదట్లో నమస్తే చెప్పి వారి దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటారని పోలీసుల విచారణలో తేలింది. గత మంగళవారం షాహదారా జిల్లాలో నమస్తే గ్యాంగ్ మూడు చోట్ల దొంగతనానికి పాల్పడిందన్నారు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేయాలని, విచారణ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: 52 ఏళ్లుగా ఆ కార్యాలయంపై ఎగరని జాతీయ జెండా

Next Story