- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జొన్నల తరలింపు ఆలస్యం.. లారీల కోసం రైతుల ఎదురు చూపు!
by Jakkula.Mamatha |
కుబీర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన జొన్నల తరలింపుకు లారీల కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు.

X
దిశ, కుబీర్: కుబీర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన జొన్నల తరలింపుకు లారీల కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు కిందున్న సంచుల్లోని జొన్నలకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన బస్తాల్లోని జొన్నలను మరో కొత్త సంచిలోకి మార్చడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. మరికొందరు డబ్బులు ఇచ్చి సంచుల్లోకి మార్చుకోవాల్సి వస్తుందని అంటున్నారు. తడిసి ఖాళీ చేసిన సంచులు యార్డులో ఎటు చూసిన దర్శనమిస్తున్నాయి. జొన్నల తరలింపు మరింత ఆలస్యం అయితే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. సంబంధిత శాఖ అధికారులు, కేంద్రాల నిర్వాహకులు త్వరగా లారీలను పంపించి జొన్నల తరలింపు ముమ్మరం చేయాలని రైతులు కోరుతున్నారు.
Next Story






