- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. గన్స్, రూ. 24 లక్షల నగదు సీజ్
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లా అడవుల్లో పోలీసులు భారీ మావోయిస్టు అత్యంత ఖరీదైన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టుల ఏరివేతే టార్గెట్‌గా భద్రతా బలగాలు చేపడుతున్న కూంబింగ్ ఆపరేషన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నారాయణ్‌పూర్ (Narayanpur) జిల్లాలోని దట్టమైన టెక్లా అటవీ ప్రాంతంలో (Tekla Forest Area) మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు రంగంలోకి దిగారు. హై అలర్ట్‌తో నలువైపులా భద్రతా బలగాలు చుట్టుముట్టి జల్లెడ పడుతున్న క్రమంలో అత్యంత రహస్యంగా భూమి కింద దాచి ఉంచిన ఓ భారీ డంప్ వారు కనిపెట్టారు.
ఆయుధాలు, రూ.24 లక్షల లిక్వడ్ క్యాష్..
అయితే, ఆ డంప్‌ను తెరచి చూడగా.. అంతర్గత అవసరాలకు ఉపయోగించే భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు (Weapons), మందుగుండు సామగ్రి, ప్రాణాంతక పేలుడు పదార్థాలు (Explosives) లభ్యమయ్యాయి. వాటితో పాటు ఎలాంటి ఆధారాలు లేని రూ.24 లక్షల లిక్విడ్ క్యాష్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టెక్లా, చుట్టుపక్కల పరిసర అటవీ ప్రాంతాల్లో ఆయుధాలు, భారీ ఎత్తున నగదు సీజ్ చేసిన తరుణంలో అదనపు బలగాలతో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. అడవుల్లో ఇంకా ఎక్కడైనా ఇలాంటి రహస్య నిల్వలు (Weapons Cache) ఉన్నాయా అనే కోణంలో డాగ్ స్క్వాడ్స్, మెటల్ డిటెక్టర్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.






