- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్కెట్లో ఘోర అగ్నిప్రమాదం.. 40కి పైగా దుకాణాలు దగ్ధం
ద్రాక్షారామం మార్కెట్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. 40 షాపులు దగ్ధం, రూ. 2 కోట్ల నష్టం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్!

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామం (draksharamam) సమీపంలోని మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రోజువారీ కూరగాయలు, వాణిజ్య మార్కెట్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. అకస్మాత్తుగా ఎగిసిపడిన మంటలు క్షణాల్లోనే మార్కెట్ అంతటా వ్యాపించడంతో 40కి పైగా దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మార్కెట్‌లోని ఒక షాపులో జరిగిన షార్ట్ సర్క్యూట్ (Electrical Short Circuit) కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో వ్యాపారులకు చెందిన వస్తువులు, నగదు, కూరగాయల నిల్వలు అగ్నికి ఆహుతి కావడంతో సుమారు రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రామచంద్రాపురం, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాద వార్త తెలుసుకున్న రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులను పరామర్శించి, వారికి ప్రభుత్వం తరఫున పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, బాధిత చిన్న వ్యాపారులకు తక్షణ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను మంత్రి సుభాష్ ఆదేశించారు.






