- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను పెళ్లి చేసుకోవాలనుకునే వారు నాకు మెసేజ్ చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన!
ఈ భూమి మీద పర్ఫెక్ట్ మనుషులు ఎవరూ ఉండరని, తాను కూడా పర్ఫెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రేఖ వేదవ్యాస్ ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ఆనందం, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుని ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. తన అందం, అభినయం నటనతో అందరినీ మెప్పించారు. తెలుగుతో పాటు కన్నడలోనూ సినిమాలు చేసిన ఆమె సడెన్‌గా అనారోగ్యం బారిన పడటంతో సినిమాలకు దూరం అయింది. 40 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవనం కొనసాగిస్తోంది. ఇక ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రేఖ తాజాగా, పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన పెళ్లి గురించి రేఖ మాట్లాడుతూ.. ఇండియా మొత్తం మీద తాను, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రమే పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా మిగిలిపోతామేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో తాను ఒకరిని ఇష్టపడినప్పటికీ, ఆ విషయాన్ని ఎదుటివారికి చెప్పే ధైర్యం చేయలేకపోయానని ఆమె ఓపెన్‌గా చెప్పారు. సిగ్గు పడటం వల్ల, ఒకవేళ చెప్తే అవతలి వాళ్లు ఏమనుకుంటారో, అసలు ఆ లవ్ వర్కౌట్ అవుతుందో లేదో అనే భయంతో మనసులోనే దాచేసుకున్నానని వివరించారు.
ఆ తర్వాత నుంచి తనకు సరైన, మంచి అబ్బాయి ఎవరూ దొరకలేదని ఆమె చెప్పారుబయట చాలా మంది తనకు ఎవరో ఒకరు లవర్ ఉండే ఉంటారు కానీ బయటకు చెప్పట్లేదని అనుకుంటున్నారని, కానీ తాను మాత్రం నిజంగానే ఇంకా సింగిల్‌గా ఉన్నానని రేఖ క్లారిటీ ఇచ్చారు. ఈ భూమి మీద పర్ఫెక్ట్ మనుషులు ఎవరూ ఉండరని, తాను కూడా పర్ఫెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఒక మంచి అబ్బాయి తనను నిజాయితీగా ప్రేమించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే పెళ్లయ్యాక భర్తను ఏమండీ అని పిలవడం తన వల్ల కాదని ఆమె నవ్వుతూ అన్నారుచివరగా తనను ఇష్టపడే వారికి ఒక క్రేజీ ఆఫర్ ఇచ్చారు రేఖ. తన వెనుక పడేవాళ్లు నిజాయితీగా ఉండి, మంచి మనసున్న వాళ్లయితే తనకు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయవచ్చని చెప్పారు. ఆ మెసేజ్‌లు చూసి తనకు నచ్చితే కచ్చితంగా రిప్లై ఇస్తానని, అయితే తాను సమాధానం ఇచ్చేంత వరకు కాస్త ఓపికగా వెయిట్ చేయాలని కోరారు.






