- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
M.S. Raju: మహేష్ కోసం అన్ని లక్షలు ఖర్చు పెట్టా.. అదే డబ్బు రియల్ ఎస్టేట్‌లో పెట్టుంటే వేరేలా ఉండేది
ఒక్కడు' సినిమా విజయోత్సవ వేడుకను రూ.40–50 లక్షలతో నిర్వహించానని ఎం.ఎస్. రాజు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబు 'ఒక్కడు' సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ... "నేను సినిమాలను భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా, అవి విజయం సాధించిన తర్వాత అదే స్థాయిలో విజయోత్సవ వేడుకలను కూడా నిర్వహించేవాడిని. ఉదాహరణకు, మహేష్ బాబు హీరోగా నేను నిర్మించిన 'ఒక్కడు' చిత్రం ఘన విజయం సాధించింది. ఆ సందర్భంగా అప్పట్లోనే దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసి భారీ ఈవెంట్ నిర్వహించాను. ఆ డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టి ఉంటే ఇప్పుడు ఎంతో పెద్ద మొత్తంగా మారేది.
కానీ నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. ఒక హీరో సినిమా విజయం సాధిస్తే, దానిని ఘనంగా సెలబ్రేట్ చేయడం వల్ల ఆ హీరో అభిమానులు ఎంతో ఆనందపడతారని నేను నమ్ముతాను" అని అన్నారు. అలాగే 'ఒక్కడు' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సరదా సంఘటనను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. "ఆ సినిమాలో ఒక సన్నివేశంలో మహేష్ బాబు ఓ ఫోన్ నంబర్ చెబుతాడు. ఆ సన్నివేశంలో ఎవరి నంబర్ ఉపయోగించాలా అని దర్శకుడు గుణశేఖర్ అడగగా, 'రాజు గారి నంబర్ పెట్టేద్దాం' అని మహేష్ బాబు చెప్పాడు. 'వద్దు... ఆయన తిడతారు' అని చెప్పినా వినకుండా, 'ఆయన వచ్చేలోపు తీసేద్దాం' అంటూ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. సినిమా విడుదలైన తర్వాత నా ఫోన్‌కు వేల సంఖ్యలో కాల్స్ వచ్చాయి. చివరికి ఆ ఇబ్బందిని తట్టుకోలేక నా ఫోన్ నంబర్ కూడా మార్చుకోవాల్సి వచ్చింది" అని ఎం.ఎస్. రాజు తెలిపారు.






