టాలెంట్ లేనివాళ్లకే వరుస అవకాశాలు ఇస్తున్నారు.. నెపోటిజంపై కృతి సనన్ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

కానీ, అస్సలు టాలెంట్ లేకపోయినా కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉందనే ఒకే ఒక్క కారణంతో కొంతమందికి ఎనిమిది, తొమ్మిదేళ్ల పాటు వరుసగా ఛాన్స్‌లు ఇవ్వడమే అన్యాయమని కృతి మండిపడ్డారు.

టాలెంట్ లేనివాళ్లకే వరుస అవకాశాలు ఇస్తున్నారు.. నెపోటిజంపై కృతి సనన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి సనన్ ఇటీవల ‘కాక్‌టెయిల్-2’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, శౌర్యువ్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీలో కృతి కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతీ సనన్, సినిమా ఇండస్ట్రీలో తన 12 ఏళ్ల ప్రయాణం గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక్కడి దాకా రావడం తనకు అస్సలు ఈజీగా సాగలేదని, కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పారు. తన మోడలింగ్ రోజులను గుర్తుచేసుకుంటూ.. తన మొదటి ఫొటోషూట్, మొదటి ర్యాంప్ షో రెండూ ఘోరంగా ఫ్లాప్ అయ్యాయని, ఆ రెండు సార్లు తాను ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చానని కృతి ఎమోషనల్ అయ్యారు. అయినప్పటికీ పట్టుదలతో మళ్లీ ఆడిషన్స్‌కు వెళ్లానని, ఆ మొండితనమే తనను ఈరోజు ఇక్కడి దాకా తెచ్చిందని అన్నారు.

అంతేకాకుండా బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజంపై కూడా కృతి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ లాంటి స్టార్ కిడ్స్‌కు మంచి టాలెంట్ ఉందని, వారికి అవకాశాలు చాలా ఈజీగా వచ్చినా వారు కష్టపడి నటనను నిరూపించుకున్నారని ఆమె చెప్పారు. కానీ, అస్సలు టాలెంట్ లేకపోయినా కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉందనే ఒకే ఒక్క కారణంతో కొంతమందికి ఎనిమిది, తొమ్మిదేళ్ల పాటు వరుసగా ఛాన్స్‌లు ఇవ్వడమే అన్యాయమని కృతి మండిపడ్డారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని నటీనటులు గనుక మొదటి రెండు మూడేళ్లలోనే హిట్లు కొట్టి తమను తాము నిరూపించుకోకపోతే, ఈ ఇండస్ట్రీ వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేస్తుందని కృతి సనన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story