గుండె కలచివేసే దృశ్యం.. చిన్నారి గుండెలపై తన్నిన అంగన్‌వాడీ కార్యకర్త (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-26 08:02:50  IST  )

పిల్లలకు ప్రేమతో, లాలనతో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అంగన్వాడీ కేంద్రంలో ఒక చిన్నారిపై జరిగిన అమానుష దాడి నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

గుండె కలచివేసే దృశ్యం.. చిన్నారి గుండెలపై తన్నిన అంగన్‌వాడీ కార్యకర్త (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలకు ప్రేమతో, లాలనతో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అంగన్వాడీ కేంద్రంలో ఒక చిన్నారిపై జరిగిన అమానుష దాడి నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మహారాష్ట్రలోని పన్వేల్ పరిధిలో గల నంద్‌గావ్ గ్రామంలోని ఒక అంగన్వాడీ కేంద్రంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. అసలేం జరిగిందంటే.. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక అంగన్ వాడీ కేంద్రం భవనం మెట్లపై ఒక చిన్నారి కూర్చుని ఉంది. అప్పుడే చీర కట్టుకుని, చేతిలో బ్యాగుతో వచ్చిన ఒక అంగన్వాడీ మహిళా ఉద్యోగి.. ఆ చిన్నారిని ఏమాత్రం జాలి లేకుండా నేరుగా గుండెలపై బూటు కాలితో బలంగా తన్నింది. ఆ దెబ్బకు ఆ చిన్నారి వెల్లకిలా వెనక్కు పడిపోయి అల్లలాడిపోతూ బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. ఆ పక్కనే ఉన్న మరో చిన్నారి కూడా భయంతో ఏడవడం వీడియోలో కనిపిస్తోంది.

సహోద్యోగి నిర్లక్ష్యం..

చిన్నారి కిందపడగానే అక్కడే ఉన్న మరో అంగన్వాడీ సిబ్బంది వచ్చి ఆ పాపను కూర్చోబెట్టింది. అయితే, దాడి చేసిన మహిళను నిలదీయాల్సింది పోయి, ఆమెతో నవ్వుతూ మాట్లాడటం స్పష్టంగా కనిపిస్తోంది. చిన్నారిని తన్నిన సదరు మహిళ మాత్రం ఏమీ తెలియనట్లు లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో నవీ ముంబై పోలీసులు రంగంలోకి దిగి సదరు అంగన్వాడీ కార్యకర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల భద్రతకు భరోసా ఇవ్వాల్సిన ఇలాంటి సంస్థల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, నిరంతర నిఘా ఉంచాలని స్థానిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story