- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదకద్రవ్యాల నివారణపై అవగాహన ర్యాలీ
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భువనగిరి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు.

దిశ, యాదాద్రి కలెక్టరేట్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భువనగిరి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుంచి ప్రారంభమై వినాయక చౌరస్తా వరకు కొనసాగింది. విద్యార్థులు, ప్రజలు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాంశ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో "మత్తు పదార్థాల రహిత యాదాద్రి భువనగిరి జిల్లా నిర్మాణం" కోసం అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ రవీందర్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, సీఐలు చంద్రబాబు, రమేష్, ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐలు అనిల్ కుమార్, నరేష్, ఇతర పోలీసు అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.






