- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు.. రాహుల్, ప్రియాంక కి హెచ్చరికలు!
వయనాడ్ కాంగ్రెస్ ఆఫీసు వద్ద కేసీ వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు. ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నికల్లో ఓటమి తప్పదంటూ రాహుల్, ప్రియాంకలకు హెచ్చరిక.

దిశ, వెబ్ డెస్క్: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన యూడీఎఫ్.. ప్రభుత్వ ఏర్పాటులో నిమగ్నమైంది. అయితే సీఎం అభ్యర్థి (CM candidate) ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం సీటు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఈ వ్యవహారంతో కేరళ కాంగ్రెస్ (Kerala Congress) లో విభేదాలు పెరిగి.. రాహుల్, ప్రియాంకలకు హెచ్చరికలు జారీ చేసే స్థాయికి పెరిగాయి. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ జిల్లా కాంగ్రెస్ (Wayanad District Congress) కార్యాలయం సమీపంలో వెలసిన కొన్ని పోస్టర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నామినేట్ చేయవద్దని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రాలను హెచ్చరిస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి. ఒకవేళ ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే, రాబోయే ఎన్నికల్లో పార్టీ మరిన్ని ఓటములను చవిచూడాల్సి వస్తుందని ఆ పోస్టర్లలో హెచ్చరించారు.
కేసీ వేణుగోపాల్ (KC Venugopal)ను సీఎంగా ప్రకటిస్తే.. వయనాడ్‌లో అమేథి వంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ చవిచూడాల్సి వస్తుందని పోస్టర్లలో హెచ్చరించారు. ఈ పరిణామం కేరళ కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. ముఖ్యంగా వయనాడ్ వంటి కీలక నియోజకవర్గంలో, పార్టీ నాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్‌పైనే సొంత పార్టీ శ్రేణుల నుంచి ఈ స్థాయిలో నిరసన వ్యక్తం కావడం పార్టీ హైకమాండ్‌కు మింగుడుపడటం లేదు. ఈ పోస్టర్ల వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పార్టీ స్థానిక నాయకత్వం ఆరా తీస్తోంది. కేరళలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం అభ్యర్థిత్వంపై జరుగుతున్న ఈ రచ్చ కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.






