- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి పుష్కరిణిలో చచ్చి తేలిన చేపలు
శ్రీవారి పుష్కరిణిలో భారీగా చేపలు చనిపోయి తేలడం కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీవారి పుష్కరిణిలో భారీగా చేపలు చనిపోయి తేలడం కలకలం రేపింది. ద్వారకా తిరుమల శ్రీవారి పుష్కరిణి మాధవకుంటలో పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెందాయి. దీనిని గమనించిన స్థానికులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయగా, సిబ్బంది అక్కడికి చేరుకుని మృతిచెందిన చేపలను తొలగించారు. అయితే ఈ చెరువును దేవస్థానం పుష్కరిణిగా అభివృద్ధి చేసి వాటర్ ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ, నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరైనా పుష్కరిణిలో విషం కలపడం వల్లే చేపలు మృతి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేవస్థానం డీఈ సూర్యనారాయణ మాత్రం.. వర్షాల సమయంలో చేపలు కొట్టుకువచ్చి పెరిగాయని, పుష్కరిణి పక్కన పంచాయతీ బోరు వేసినప్పుడు గ్యాస్ వాటర్ అందులోకి వెళ్లడంతోనే చేపలు చనిపోయాయని వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు గల అసలు కారణంపై స్పష్టత రావాల్సి ఉంది.






