- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL.. బోణీ కొట్టిన ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్ : మహిళల ప్రీమియర్ లీగ్(WPL) నేడు ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ మెగ్ లానింగ్ 38 బంతుల్లో 54 పరుగులు చేసి అర్ధశతకం సాధించగా, హర్లీన్ డియోల్ 36 బంతుల్లో 44 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగింది. ఢిల్లీ బౌలర్లలో మారిజెన్ కాప్ 2 వికెట్లు, షెఫాలీ వర్మ 2 వికెట్లు పడగొట్టగా, నందిని శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. లిజెలీ లీ 67 (44 బంతుల్లో), లారా వాల్వార్డ్ 25* (24 బంతుల్లో), షెఫాలీ వర్మ 36 (32 బంతుల్లో), జెమీమా రోడ్రిగ్స్ 21 (24 బంతుల్లో), మరిజనే 5* (6 బంతుల్లో) రన్స్ చేశారు. యూపీ బౌలర్లలో దీప్తీ శర్మ 2, ఆశా శోభన ఒక వికెట్ పడగొట్టారు. ఈ మొదటి విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్‌లో 4వ స్థానంలోకి రాగా.. అన్ని మ్యాచుల్లో అపజయం పాలై యూపీ అట్టడుగు స్థానానికే పరిమితం అయింది.






