సోషల్ మీడియా పరిచయం కోసం ప్రాణం పోసిన వారినే బలితీసుకున్న బిడ్డ.. సిపి సజ్జనార్ భావోద్వేగ పోస్ట్

by Malleboina Mahesh |

ప్రియుడి కోసం తల్లిదండ్రులకు విషపు సూది ఇచ్చి కన్న కూతురు హత్య చేసింది. ఈ షాకింగ్ ఘటన వికారాబాద్ జిల్లాలో బట్వారం మండలం యాచారం గ్రామంలో చోటు చేసుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

సోషల్ మీడియా పరిచయం కోసం ప్రాణం పోసిన వారినే బలితీసుకున్న బిడ్డ.. సిపి సజ్జనార్ భావోద్వేగ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియుడి కోసం తల్లిదండ్రులకు విషపు సూది ఇచ్చి కన్న కూతురు హత్య చేసింది. ఈ షాకింగ్ ఘటన వికారాబాద్ జిల్లాలో బట్వారం మండలం యాచారం గ్రామంలో చోటు చేసుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సమాజం తలదించుకునేలా, కన్నపేగు కన్నీరు పెట్టేలా జరిగిన ఈ దారుణ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. వేలు పట్టి నడిపించిన తండ్రిని, గోరుముద్దలు తినిపించిన తల్లిని ఒక బిడ్డ తన చేతులతోనే విగతజీవులుగా మార్చడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు.

కేవలం సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాల కోసం, అశాశ్వతమైన ఆకర్షణల కోసం ప్రాణం పోసిన తల్లిదండ్రుల ఊపిరి తీయడం సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయమని సీపీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. బంధాలను చంపుకుని పొందే ప్రేమేదీ ఈ లోకంలో శాశ్వతం కాదని, యువత పెడదారి పడుతున్న తీరును ఆయన తప్పు పట్టారు.

తల్లిదండ్రులు బాధ్యత కాదు.. ఓ ఎమోషన్

"తల్లిదండ్రులంటే కేవలం బాధ్యత మాత్రమే కాదు. ఒక ఎమోషన్. వారిని కోల్పోతే ఆ లోటును భర్తీ చేసేందుకు ఈ లోకంలో ఎవరూ లేరు" అంటూ ఆయన యువతకు హితబోధ చేశారు. బాధ్యతగా ఉండాల్సిన వయసులో, క్షణికావేశానికి లోనై కన్నవారిని కడతేర్చడం కంటే దారుణం మరొకటి ఉండదని సీపీ సజ్జనార్ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story