కుమార్తె తెచ్చిపెట్టిన అదృష్టం.. లాటరీలో రూ. 49 కోట్ల జాక్‌పాట్

by Malleboina Mahesh |

ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి సుమారు రూ. 12,000 వెచ్చించి ఆన్‌లైన్ ద్వారా అబుదాబీ బిగ్ టికెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే ఈ టికెట్ నంబర్‌ను ఎంపిక చేసే సమయంలో తన చిన్నారి కుమార్తెను అడగగా, ఆమె సూచించిన నెంబర్‌నే శంతను ఎంచుకున్నారు. ఆ చిన్నారి పాదగుణమే శంతనును నేడు మల్టీ మిలియనీర్‌ను చేసింది.

కుమార్తె తెచ్చిపెట్టిన అదృష్టం.. లాటరీలో రూ. 49 కోట్ల జాక్‌పాట్
X

దిశ, వెబ్‌డెస్క్: గతంలో పెద్దలు ఏ పని చేసిన శ్రమతో పాటు అదృష్టం కూడా ఉండాలని చెబుతూనే ఉంటారు. అదృష్టం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. నేటి సమాజంలో ఆడ పిల్ల పుడితే కష్టంగా భావించేవారు వేలాది మంది ఉన్నారు. కానీ ఆ ఆడపిల్లలే నేడు తల్లిదండ్రులకు అదృష్టం గా మారుతున్నారు. కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించి తమ సత్తాను చాటుతుంటే మరికొందరు తమ అదృష్టంతో తల్లిదండ్రులకు లక్ ను తెచ్చి పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన శంతను శెట్టిగార్ (33) అనే వ్యక్తికి తన కుమార్తే రూపంలో భారీ అదృష్టం వరించింది. అబుదాబీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 'బిగ్ టికెట్' రాఫెల్ డ్రాలో శంతను ఏకంగా 20 మిలియన్ దిర్హామ్స్ (రూ. 45.5 - 49 కోట్లు) గెలుచుకున్నాడు.

కుమార్తె సలహాతో అదృష్టం

శంతను శెట్టిగార్ గత కొన్నేళ్లుగా ఒమన్‌లోని మస్కట్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో కొంతమంది భారతీయులు లాటరీలో భారీ నగదు గెలుచుకున్న వార్తలు వైరల్ కావడంతో అతను కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశారు. ఈ క్రమంలోనే ఇటీవల తన స్నేహితుడితో కలిసి సుమారు రూ. 12,000 వెచ్చించి ఆన్‌లైన్ ద్వారా అబుదాబీ బిగ్ టికెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే ఈ టికెట్ నంబర్‌ను ఎంపిక చేసే సమయంలో తన చిన్నారి కుమార్తెను అడగగా, ఆమె సూచించిన నెంబర్‌నే శంతను ఎంచుకున్నారు. ఆ చిన్నారి పాదగుణమే శంతనును నేడు మల్టీ మిలియనీర్‌ను చేసింది.

లక్కీ డ్రాలో తన నెంబర్ గెలిచినట్లు నిర్వాహకుల నుంచి ఫోన్ రాగానే శంతను ఆనందానికి అవధులు లేవు. ఈ వార్త తెలియగానే ఉడుపిలోని ఆయన స్వగృహంలో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. "ఈ విజయం నాది కాదు, నా కుమార్తె నా జీవితంలోకి తెచ్చిన అదృష్టం" అని శంతను భావోద్వేగంతో వెల్లడించారు. ఈ భారీ మొత్తంతో తన కుటుంబ భవిష్యత్తును చక్కదిద్దుకోవడం తో పాటు, కొంత మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని ఆ వ్యక్తి స్పష్టం చేశాడు. ఏది ఏమైనప్పటికి శాంతను శెట్టిగార్ కు కుమార్తె రూపంలో అదృష్టం వరించిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Next Story