పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు

by Gantepaka Srikanth |

పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖారారు అయ్యాయి.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖారారు అయ్యాయి. ఈనెల 28వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) జరుగనున్నాయి. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలి దశ సమావేశాలు జరుగనున్నాయి. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం 2026-27 వార్షిక బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 29వ తేదీన ఆర్థిక సర్వే ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. జనవరి 30, 31 తేదీల్లో సెలవులు రానున్నాయి. రెండో దశ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగే అవకాశం ఉంది. వరుసగా తొమ్మిదోసారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అత్యధికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్‌ రికార్డు ఉంది. ఆయన రెండు దఫాల్లో 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Next Story