- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope(July 23):ఈ రోజు 12 రాశుల దిన ఫలాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం ఆధారంగా ఈ రోజు(జులై 23) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మేష రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఆఫీసులో సహచరుల సహకారంతో అనుకున్న పనులు పూర్తవుతాయి. ముందుచూపుతో వ్యవహరించడం వల్ల ముఖ్యమైన పనుల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో ఆశించిన దానికంటే మంచి ఆదాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వేంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి ఆరాధన శుభకరం.
వృషభ రాశి
ఈ రాశి వారికి గ్రహబలం అనుకూలంగా ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తోంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కొత్త ప్రయత్నాలకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. ప్రత్యర్థులు లేదా విమర్శకుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది.
మిథున రాశి
ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనుల్లో కొంత శ్రమ, అదనపు బాధ్యతలు పెరుగుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే పనులు సాఫీగా సాగుతాయి. అనాలోచిత పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శారీరక అలసట కలగకుండా తగిన విశ్రాంతి, వ్యాయామం అవసరం. ఇష్టదేవతా ధ్యానం చేయడం మంచిది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఇవాళ బాగుంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటుంది. కుటుంబపరంగా ఉన్న పాత సమస్యలను ప్రశాంతంగా చర్చించి పరిష్కరించుకోవడం మంచిది. పని పట్ల ఉన్న అంకితభావం అధికారులను ఆకట్టుకుంటుంది. నిరంతర ధనానుకూలత ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయస్కరం.
సింహ రాశి
సింహరాశి వారు ఇవాళ ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సూర్య నమస్కారాలు చేయడం శుభప్రదం.
కన్య రాశి
ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త విషయాలపై దృష్టి సారిస్తారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. పని ప్రదేశంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారం నిలకడగా సాగుతుంది. వినాయకుని పూజ కలసివస్తుంది.
తుల రాశి
ఈ రాశి వారు ప్రయాణాలు, పనుల విషయంలో కొద్దిగా అప్రమత్తత అవసరం. ఖర్చులను నియంత్రించుకోవడం మేలు. ఆహారనియమాలు సరిగ్గా పాటించాలి. మనశ్శాంతి కోసం కొంత సమయం కేటాయించండి. గురుగ్రహ శ్లోకం జపించడం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఓర్పుతో వ్యవహరించాల్సిన రోజు. చిన్న చిన్న విషయాలకు చిరాకు పడకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. శ్రమకు తగినంత ఫలితం ఆలస్యంగానైనా లభిస్తుంది. స్నేహితుల సలహాలు ఉపయోగపడతాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం ఆంజనేయ స్వామి ధ్యానం మానసిక ధైర్యాన్ని ఇస్తుంది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఇవాళ దైవిక ఆలోచనలు, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. దత్తాత్రేయ స్వామిని లేదా గురుదేవులను స్మరించడం శ్రేయస్కరం.
మకర రాశి
చేపట్టిన పనుల్లో ఆలస్యంగా పూర్తవుతాయి. ఒత్తిడి తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం వల్ల శారీరక, మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా పూర్తి చేయాలి. సమయానుకూలంగా పనులు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. శివారాధన మేలు చేస్తుంది.
కుంభ రాశి
ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు తగవు. సమాధానంగా, ప్రశాంతంగా మాట్లాడటం వల్ల అనవసర వివాదాలను నివారించవచ్చు. ఆర్థిక నిర్ణయాలలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. సుందరకాండ పారాయణం లేదా హనుమాన్ చాలీసా చదవడం ఉపకరిస్తుంది.
మీన రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. మానసిక దృఢత్వంతో నిర్ణయాలు తీసుకోవాలి. పట్టుదలతో శ్రమిస్తే కోరుకున్న ఫలితాలు దక్కుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రీ దక్షిణామూర్తి లేదా లక్ష్మీ నరసింహ స్వామి పూజ శుభకరం.






