దంచికొట్టిన ఎండలు.. దహెగాంలో అత్యధికంగా 46.3 డిగ్రీలు

by Muthe.Rajitha |

తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం కొమురంభీం జిల్లాలోని దహెగాంలో రికార్డు స్థాయిలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

దంచికొట్టిన ఎండలు.. దహెగాంలో అత్యధికంగా 46.3 డిగ్రీలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. ఎండలు దంచి కొడుతుండటంతో పాటు తీవ్రమైన వడ గాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలలో ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం నాటి భారత వాతావరణ విభాగం(IMD) నివేదిక ప్రకారం.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాంలో అత్యధికంగా 46.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, పెద్దపల్లి జిల్లా రామగుండంలలో సైతం గరిష్టంగా 46.2 డిగ్రీలుగా నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 45.6 డిగ్రీలు, జగిత్యాల, సూర్యాపేట జిల్లాల్లో 45.4 డిగ్రీల ఎండ నమోదు కాగా.. ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో 45.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదని భారత వాతావరణ విభాగం (IMD) స్పష్టం చేసింది. మరో రెండు రోజుల పాటు ఇదే విధమైన తీవ్రమైన వడగాల్పులు, ఎండలు కొనసాగుతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HMD) ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు 'యెల్లో అలర్ట్' (Yellow Alert) జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story