సిద్దిపేటలో సైక్లింగ్ ర్యాలీ విజయవంతం

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-07 09:25:40  IST  )

వరల్డ్ సైకిల్ డే పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా క్రీడా యువజన శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు.

సిద్దిపేటలో సైక్లింగ్ ర్యాలీ విజయవంతం
X

దిశ, సిద్దిపేట అర్బన్: వరల్డ్ సైకిల్ డే పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా క్రీడా యువజన శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డివైఎస్ఓ వీరారెడ్డి, సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి శ్రీనివాసులు, కేలో ఇండియా సైక్లింగ్ కోచ్ సంజీవ్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ వీరారెడ్డి, సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ.. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సూచన మేరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. సైక్లింగ్‌తో ఆరోగ్యంతో పాటుగా శారీరక దృఢత్వం చేకూరుతుంది అన్నారు. పర్యావరణహిత సైక్లింగ్ సాధన ప్రతి ఒక్కరు చేయాలన్నారు. విద్యార్థులు సైతం సైక్లింగ్ పై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేలో ఇండియా సైక్లిస్టులు 50 మంది పాల్గొన్నారు.

Next Story