ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు: తహసీల్దార్

by Kodari Anjali |

పినపాక మండల పరిధిలోని గోపాలరావుపేట గ్రామంలో సర్వే నెంబర్ 128 లోని 126 ఎకరాల భూమిని సర్వే చేసి మండల సర్వేయర్, జిల్లా సర్వేయర్ ప్రభుత్వ భూమిగా తేల్చారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు: తహసీల్దార్
X

దిశ, పినపాక: పినపాక మండల పరిధిలోని గోపాలరావుపేట గ్రామంలో సర్వే నెంబర్ 128 లోని 126 ఎకరాల భూమిని సర్వే చేసి మండల సర్వేయర్, జిల్లా సర్వేయర్ ప్రభుత్వ భూమిగా తేల్చారు. అట్టి ప్రభుత్వ భూమి నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 30 ఎకరాల భూమిని కేటాయించారు. మిగతా భూమికి హద్దులు నిర్ణయించారు. ఇట్టి ప్రభుత్వ భూమిలో కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఆ పార్టీకే చెందిన పినపాక గ్రామంలో నివసిస్తున్న ఓ ప్రబుద్ధుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పేదల సొమ్మును దోచుకుంటున్నాడు. ఒకే ప్లాట్‌ను తండ్రికి, ఇద్దరు కొడుకులకు మూడు సార్లు అమ్మి డబ్బులు కాజేశాడు. ఇట్టి విషయమై స్థానిక తహసీల్దార్ జి.శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా ఆయన స్పందించారు. ప్రభుత్వ భూమి కొనడం, అమ్మడం చట్ట విరుద్ధమన్నారు. తక్షణమే విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామన్నారు. తక్షణమే లేఔట్‌లు తొలగిస్తామన్నారు. ‎

Next Story