ఆపరేషన్ హనుమాన్.. ఒకే ప్రాంతానికి పరిమితమైన పులి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-07 10:33:34  IST  )

నెలకోట–పూడిపల్లి సమీప కొండ ప్రాంతంలో పులి సంచారాన్ని నియంత్రించడంలో అటవీ శాఖ విజయం సాధించింది. డ్రోన్ నిఘా, గ్రౌండ్ టీమ్స్, వన్యప్రాణి, పశువైద్య నిపుణుల ఉమ్మడి సమన్వయంతో పులిని ఒకే ప్రాంతానికి పరిమితం చేశారు. ..

ఆపరేషన్ హనుమాన్.. ఒకే ప్రాంతానికి పరిమితమైన పులి
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నెలకోట–పూడిపల్లి సమీప కొండ ప్రాంతంలో పులి సంచారాన్ని నియంత్రించడంలో అటవీ శాఖ విజయం సాధించింది. డ్రోన్ నిఘా, గ్రౌండ్ టీమ్స్, వన్యప్రాణి, పశువైద్య నిపుణుల ఉమ్మడి సమన్వయంతో పులిని ఒకే ప్రాంతానికి పరిమితం చేశారు. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రక్షణ లభించడంతో పాటు స్థానికంగా భద్రత మరింత బలోపేతమైంది.

డిప్యూటీ సీఎం ఆదేశాలతో..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. H.A.N.U.M.A.N ప్రత్యేక బృందాలు రాత్రంతా అత్యంత అప్రమత్తంగా ఉంటూ నిరంతరం విధులను నిర్వహించాయి. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా, పులిని సురక్షితంగా బంధించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది.

ఆందోళనొద్దు..

ఈ నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని అధికారులు కోరారు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని, అటవీ శాఖ అధికారులు జారీ చేసే సూచనలను, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

పులి వీడియో..

Next Story