- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ నాయకుడు 'ఎల్లేనివీ దొంగ నాటకాలు.. దొంగ దీక్షలు : కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజు
కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జి ఎల్లేని సుధాకర్ రావు కొల్లాపూర్ లో శనివారం చేపట్టిన దొంగ నాటకాలు.. దొంగ దీక్షలు మానుకోవాలని కొల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బచ్చలకూర బాల రాజు విమర్శించారు.

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జి ఎల్లేని సుధాకర్ రావు కొల్లాపూర్ లో శనివారం చేపట్టిన దొంగ నాటకాలు.. దొంగ దీక్షలు మానుకోవాలని కొల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బచ్చలకూర బాల రాజు విమర్శించారు. ఆదివారం కొల్లాపూర్ లో మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చింది ఇరిగేషన్ ప్రాజెక్టులు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులను అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆయన విమర్శించారు. మీరు నిజంగా దీక్షలు చేయాలనుకుంటే పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని దీక్షలు చేయండి అని సూచించారు.
చట్టసభలో బీసీలు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పార్లమెంటుకు పంపిస్తే ఎందుకు చేయడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఆయన దుయ్యబట్టారు. నువ్వు నిజంగా కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి కోరేవాడివైతే సోమశిల లో హెలిప్యాడ్ కోసం ఎకరా భూమి ఇవ్వకుండా అడ్డుపడి ఆపింది ఎవరు..? కొల్లాపూర్ అభివృద్ధి కోరేవాడివా! నువ్వు కొల్లాపూర్ లో బొమ్మ బీరం హర్షవర్ధన్ రెడ్డి అయితే బోర్సు సుధాకర్ రావు అని బాల రాజు విమర్శించారు. కొల్లాపూర్ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అన్వర్, బోరెల్లి మహేష్, మానవపాడు నరసింహ, పట్టణ అధ్యక్షుడు పెబ్బేటి శేఖర్, నాయకులు రెడ్డి సత్యం, రామ్మోహన్, కొత్త మధుసూదన్, రామకృష్ణ పాల్గొన్నారు.






