సిఐఎస్ఎఫ్ జవాన్ల ... సండే ఆన్ సైకిల్

by Taduka Kalyani |

ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సిఐఎస్ఎఫ్ యూనిట్ ఎన్ ఎఫ్ సి ఆధ్వర్యంలో సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు

సిఐఎస్ఎఫ్ జవాన్ల ... సండే ఆన్ సైకిల్
X

దిశ, కాప్రా: ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సిఐఎస్ఎఫ్ యూనిట్ ఎన్ ఎఫ్ సి ఆధ్వర్యంలో సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం డి ఏ ఈ కాలనీలోని సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ లో యూనిట్ కమాండెంట్ శంకర్రావు బైరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డి ఏ ఈ కాలనీ నుంచి ఈసీఐఎల్, కుషాయిగూడ తదితర కాలనీల మీదుగా సుమారు 15 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ శంకర్రావు బైరెడ్డి మాట్లాడుతూ... ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సైకిల్ తొక్కడం ఎంతో శ్రేయస్కరం అన్నారు. సైక్లింగ్ శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందన్నారు. ఇక మంచి జీవనశైలిని అలవర్చుకోవడం, సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ జై శంకర్ సింగ్, పెద్ద సంఖ్యలో జవాన్లు , వారి కుటుంబ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు.

Next Story