పోలీస్ అధికారుల‌పై రెచ్చిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి

by Ajay Maddhiboyina |

పోలీస్ అధికారుల‌పై టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి రెచ్చిపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. స్థానిక ఎస్సై, సీఐలు వైసీపీ హయాంలో తమను ఎన్నికల్లో స్వేచ్ఛగా పోటీ చేయనివ్వలేదని ఆరోపించారు.

పోలీస్ అధికారుల‌పై రెచ్చిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: పోలీస్ అధికారుల‌పై టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి రెచ్చిపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. స్థానిక ఎస్సై, సీఐలు వైసీపీ హయాంలో తమను ఎన్నికల్లో స్వేచ్ఛగా పోటీ చేయనివ్వలేదని ఆరోపించారు. అప్పట్లో ప్రజాస్వామ్యం లేదని, టీడీపీ నాయకులను పోలీసులు తీవ్రంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో పైనుండి ఆదేశాలు వ‌చ్చాయ‌ని టీడీపీ నాయ‌కుల‌ను హౌస్ అరెస్ట్ లు చేశార‌ని చెప్పారు. నామినేష‌న్ వేస్తే రిగ్గింగ్ కూడా చేశార‌ని అన్నారు.

మీకు యూనిఫాం ఇచ్చింది ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డానికి అని మండిప‌డ్డారు. రేపు మీ పిల్ల‌లు ఎస్సై, సీఐ అవ్వ‌క‌పోవ‌చ్చ‌ని అప్పుడు ప్ర‌జ‌ల‌కు వచ్చిన స‌మ‌స్య‌లే వాళ్లుకు కూడా వ‌స్తే ఎవ‌రు తీరుస్తార‌ని ప్ర‌శ్నించారు. దేశంలో లా అండ్ ఆర్డ‌ర్ పోలీసుల‌పై ఆధార‌ప‌డుతుంద‌ని, అది త‌ప్పితే త‌మ‌కు కోర్టులు ఉన్నాయ‌ని అన్నారు. త‌న‌పై 96 కేసులు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే జైలుకు వెళ్లి వ‌చ్చాన‌ని చెప్పారు. త‌న‌లాంటి వాళ్ల‌ను ఎవ‌రు ర‌క్షించాల‌ని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉంటే గ‌తంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌద‌రిపై కూడా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే చేశారు. ఇప్పుడు ఎస్సై, సీఐల‌కు వార్నింగ్ ఇవ్వ‌డంతో ఆయ‌న వ్యవ‌హారం మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.

Next Story