- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర భద్రం.. మీ వాట్సాప్‌కు వచ్చే హోలీ లింకులు మిమ్మల్ని ముంచేయవచ్చు!
హోలీ ఆఫర్ల పేరిట సైబర్ మోసాలు! ఫేక్ లింకులతో జాగ్రత్తగా ఉండాలని శిఖాగోయల్ హెచ్చరిక. మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి.

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరగాళ్లు రోజుకో రూపం దాల్చి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో హోలీ పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. రంగులు, గిఫ్ట్ వోచర్లు, హోలీ ఈవెంట్ పాస్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, ఎస్ఎంఎస్ (SMS), సోషల్ మీడియా ద్వారా నకిలీ లింకులను పంపిస్తున్నారు. ఈ ఆకర్షణీయమైన లింకులపై క్లిక్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అవ్వడమే కాకుండా, మీ బ్యాంక్ ఖాతాలోని సొమ్ము క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Telangana Cyber Security Bureau) డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేహాస్పద లింకులను ఓపెన్ చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
మోసపోతే వెంటనే ఇలా చేయండి..
ఒకవేళ మీరు పొరపాటున ఇటువంటి లింకులపై క్లిక్ చేసి ఆర్థికంగా మోసపోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 అనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి. బాధితులు తక్షణమే స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే www.cybercrime.gov.in పోర్టల్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. పండుగ ఉత్సాహంలో అపరిచిత లింకుల పట్ల అప్రమత్తంగా ఉండి మీ వ్యక్తిగత సమాచారాన్ని, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదని అధికారులు స్పష్టం చేశారు.






