- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసుల తనిఖీలు.. 92 కిలోల గంజాయి స్వాధీనం
నగర పరిధిలో మదకద్రవ్యాలపై సర్కార్ ఉక్కుపాదం మొపినప్పటికీ.. అక్రమార్కుల దందాకు అడ్డుకట్టపడటం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: నగర పరిధిలో మదకద్రవ్యాలపై సర్కార్ ఉక్కుపాదం మొపినప్పటికీ.. అక్రమార్కుల దందాకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా, సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్‌చెరు (Patancheru) శివారులోని టోల్‌గేట్ సమీపంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు కారులో అక్రమంగా తరలిసున్న 92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ముగ్గురు నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు.. ఎవరికి విక్రయించడానికి తీసుకెళ్తున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. డ్రగ్స్ రవాణాపై పటాన్‌చెరు, పరిసర ప్రాంతాల్లో నిఘా మరింత కఠినతరం చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.






