- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎస్‌ఆర్ నిధులు ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించాలి : మంత్రి
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్) నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా, పారదర్శకంగా వినియోగించి సామాజిక అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్) నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా, పారదర్శకంగా వినియోగించి సామాజిక అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పరిశ్రమల ప్రతినిధులతో జరిగిన సీఎస్‌ఆర్ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వైద్యసంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులను ప్రాధాన్యతతో కేటాయించాలి అని సూచించారు. జిల్లాలోని పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొని ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. జిల్లాలోని ఆయా అవసరాలను గుర్తించి, కార్యాచరణ రూపొందించాలని అని మంత్రి కోరారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో వాష్ రూమ్స్, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షేడ్స్, డైనింగ్ హాల్, డార్మెంటరీ, బెడ్స్, అదనపు క్లాస్‌రూమ్‌ల నిర్మాణం, ఫర్నిచర్, తాగునీటి సౌకర్యాలు, పారిశుధ్య వసతుల కల్పనకు సీఎస్‌ఆర్ నిధులను ప్రాధాన్యతగా వినియోగించాలి అని తెలిపారు. సీఎస్‌ఆర్ ప్రతిపాదనల అమలు, పురోగతి పై సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ప్రతిపాదిత పనులు సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాలోని పరిశ్రమలు సామాజిక అభివృద్ధిలో భాగస్వాములై ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తోడ్పడాలి. ప్రజాప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.






