- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్ధీ.. 15 గంటలకు చేరిన సర్వదర్శన సమయం
తిరుమలలో భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం. 3 నెలల్లో 65 లక్షల మందికి దర్శనం.. రూ. 356 కోట్ల హుండీ ఆదాయం.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానంలో గత రెండు రోజులుగా భక్తుల రద్దీ పెరిగిపోతుంది. వరుస సెలవులు, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తల్లిదండ్రులు మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శనివారం తెల్లవారు జామున తిరుమల వీధులన్ని బక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో, వెలుపల ఉన్న క్యూలైన్లలో భక్తులు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే 68,445 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, శ్రీవారి హుండీ ద్వారా రూ. 3.79 కోట్లు ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు అన్నప్రసాదం, తాగునీరు వంటి సౌకర్యాలను క్యూలైన్లలో నిరంతరాయంగా అందజేస్తున్నారు.
మరోవైపు, తిరుమలలో ఇటీవల ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICC) వ్యవస్థ క్యూలైన్ల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈ నూతన సాంకేతికత వల్ల భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గడమే కాకుండా, దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2026 ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి - మార్చి) రికార్డు స్థాయిలో దాదాపు 65 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయంలో హుండీ ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ. 356 కోట్లుగా నమోదైందని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున సర్వదర్శనం భక్తులు సహనంతో వేచి ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.






